బాలీవుడ్ లో కరోనా కలకలం... నటి రేఖ బంగ్లాకు తాళం వేసిన అధికారులు

12-07-2020 Sun 13:13
  • రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్
  • కంటైన్మెంట్ జోన్ అంటూ రేఖ ఇంటి బయట బోర్డు
  • రేఖ బంగ్లాలో ఒక పోర్షన్ మాత్రమే సీల్ చేశామన్న అధికారి!
BMC officials sealed actress Rekha bungalow

భారత్ లో కరోనా రక్కసి భీకరస్థాయిలో విజృంభిస్తోంది. బాలీవుడ్ ప్రముఖులనుకూడా ఈ వైరస్ భూతం వదలడంలేదు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

తాజాగా ప్రముఖ నటి రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ముంబయి మున్సిపల్ అధికారులు రేఖ బంగ్లాకు తాళం వేశారు. అంతేకాదు, కంటైన్మెంట్ జోన్ అంటూ రేఖ ఇంటి బయట బోర్డు కూడా పెట్టారు. కాగా, రేఖ బంగ్లాలోని ఓ పోర్షన్ కు మాత్రమే సీల్ వేశారని ఓ అధికారి చెబుతున్నారు. ఇప్పటికే బోనీ కపూర్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్ ల సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు.