అల్లు అర్జున్ పిల్లల ఫొటోలు వైరల్‌!

12-07-2020 Sun 11:52
  • రెయిన్ కోట్లు ధ‌రించిన అయాన్, అర్హ‌
  • ఫొటోలు పోస్ట్ చేసిన స్నేహా రెడ్డి 
  • తమ ఇంటి గార్డెన్‌లో బన్నీ పిల్లలు
allu arjun son daughter pics viral

అల్లు అర్జున్ కుమారుడు, కూతురు అయాన్, అర్హ‌ రెయిన్ కోట్లు ధ‌రించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారిద్దరు వ‌ర్షంలో నిలబడి ఉండగా తీసిన ఫొటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పోస్ట్ చేశారు. తమ ఇంటి గార్డెన్‌లో రెయిన్ కోట్లు ధ‌రించి వారిద్దరు నిలబడ్డారు.

స్నేహారెడ్డి పోస్ట్ చేసిన ఈ ఫొటో బన్నీ అభిమానులను అలరిస్తోంది. అల వైంకుఠ పురములో సినిమా హిట్‌ అనంతరం  సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోవడంతో నటులు ఇంటి వద్దే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు.