దయచేసి ఇటువంటి రూమర్లను వ్యాప్తి చేయడం ఆపండి: 'రణ్‌బీర్‌కు కరోనా' వార్తలపై రిద్దిమా కపూర్

12-07-2020 Sun 11:09
  • నీతూ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌కు కరోనా అంటూ ప్రచారం
  • మండిపడ్డ డిజైనర్ రిద్దిమా కపూర్ సాహ్ని
  • అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
Riddhima Kapoor on rumours of Neetu Ranbir testing positive for COVID 19

తన తల్లి నీతూ కపూర్‌తో పాటు సోదరుడు, సినీనటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ వస్తోన్న రూమర్లపై డిజైనర్ రిద్దిమా కపూర్ సాహ్ని మండిపడింది. అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని చెప్పింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకిన నేపథ్యంలో నీతూ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌కు కూడా కరోనా సోకిందని రూమర్లు వస్తున్నాయి.

'ఈ వార్తల్లో నిజం లేదు. కరోనా విపత్కర సమయంలోనయినా ఇటువంటి రూమర్లను వ్యాప్తి చేయడం దయచేసి ఆపండి. మేము పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నాము' అని రిదిమా చెప్పింది. కాగా, ఇటీవల రిదిమా ఇచ్చిన ఓ బర్త్ డే పార్టీకి అమితాబ్‌ బచ్చన్ మనవడు అగస్త్య నంద హాజరయ్యారని, ఆ తర్వాతే అమితాబ్‌కు కరోనా సోకిందని అసత్య వార్తలు వస్తున్నాయి.