Corona Virus: దేశంలో ఒక్కరోజులో 28 వేలకు పైగా కరోనా కేసులు

  • ఇప్పటివరకు మొత్తం కేసులు 8,49,553
  • మృతుల సంఖ్య మొత్తం 22,674
  • 2,92,258 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 5,34,621 మంది
 Over 28000 coronavirus cases in India in 24 hours

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,637 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 551 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,49,553కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,674కి పెరిగింది. 2,92,258 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,34,621 మంది కోలుకున్నారు.
                                       
     
నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,15,87,153 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,80,151 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News