అమితాబ్ త్వరగా కోలుకోవాల‌ని సినీ నటుల ట్వీట్లు‌

12-07-2020 Sun 09:52
  • కరోనాతో ఆసుపత్రిలో చేరిన బిగ్‌ బీ
  • టాలీవుడ్‌ ప్రముఖుల స్పందన
  • కోలుకోవాలని ప్రార్థన
Film industry wishes speedy recovery for Big B

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు టాలీవుడ్ నటులు ట్వీట్లు చేశారు. 'మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము అమిత్‌ జీ' అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'డియర్‌ అమిత్‌ జీ.. మీరు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము' అని అక్కినేని నాగార్జున తెలిపారు.

అలాగే, మ‌హేశ్ బాబు‌, ర‌వితేజ‌, రాశీఖ‌న్నా, తాప్సీ, ప్రియ‌మ‌ణి, నిత్యామీన‌న్‌తో పాటు పలువురు అమితాబ్ బచ్చన్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్ త్వరలోనే కోలుకుని తిరిగి ఆరోగ్యవంతంగా కనపడతారని ఆకాంక్షిస్తున్నట్లు బాలీవుడ్ నటులు మాధురీ దీక్షిత్, సోనం కపూర్, షాహిద్‌ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్‌తో పాటు పలువురు ట్వీట్లు చేశారు.