లక్షలాది మంది నిరుద్యోగులను జగన్ మోసం చేశారు: కళా వెంకట్రావు

12-07-2020 Sun 09:30
  • ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు
  • ఏడాదిలోనే మూడు లక్షల ఉద్యోగాలు తొలగించారు
  • ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు
  • ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదు
kala vankat rao fires on jagan

లక్షలాది మంది నిరుద్యోగులను ఏపీ సీఎం జగన్ మోసం చేశారని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మూడు లక్షల ఉద్యోగాలు తొలగించారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రానికి జగన్ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని చెప్పిన జగన్.. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారిని సలహాదారులుగా నియమించుకున్నారని ఆయన విమర్శించారు. గత ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని జగన్‌ చెప్పారని ఆయన గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఆయన ఎందుకు మాట్లాడడం లేదని కళా వెంకట్రావు ప్రశ్నించారు. నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. పదవ తరగతి కూడా పాసవ్వని కొడాలి నానికి రాష్ట్ర మంత్రిగా జగన్‌ ఉద్యోగం ఇచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలో డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ చేసిన వాళ్లని మాత్రం మద్యం దుకాణాల్లో బేరర్లుగా చేశారని విమర్శించారు.