అమితాబ్ ఆరోగ్యంపై నానావతి హాస్పిటల్ ప్రకటన!

12-07-2020 Sun 08:55
  • అమితాబ్ ఆరోగ్య పరిస్థితి స్థిరం
  • ఐసొలేషన్ యూనిట్ లో ఉంచాం
  • వెల్లడించిన నానావతి హాస్పిటల్ పీఆర్వో
Nanavati Hospital Statement on Amitab Health

నిన్న రాత్రి కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పీఆర్వో వెల్లడించారు. అమితాబ్ ను ఐసొలేషన్ యూనిట్ లో ఉంచామని  వెల్లడించారు. అమితాబ్ వయసు 77 సంవత్సరాలు కాగా, ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో వైద్యులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారని అన్నారు.

అమితాబ్ కు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు జరిపించామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. ఈ తండ్రీ కొడుకులు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్ కావాలని సూచించారు.