Amitabh Bachchan: కాలేయ, ఉదర వ్యాధులు, వృద్ధాప్యం... అమితాబ్ విషయంలో వైద్యులు చెబుతున్నదిదే!

  • 1982లో ఘోర ప్రమాదానికి గురైన అమితాబ్
  • అప్పటి నుంచే మొదలైన కాలేయ సమస్యలు
  • ప్రస్తుతానికి వెంటిలేటర్ అమర్చలేదన్న వైద్యులు
Doctors Said Amitab Will Cure with Treatment

అసలే ఏడు పదులు దాటిన వయసు. పైగా కాలేయ, ఉదర సంబంధిత సమస్యలు. గతంలోనే పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స. ఈ వయసులో అమితాబ్ బచ్చన్ కు ప్రాణాంతక కరోనా సోకడం, గత రాత్రి నానావతి ఆసుపత్రిలో చేరడంతో, అక్కడి వైద్యులు అనుక్షణం అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. అమితాబ్ విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి అమితాబ్ కు వెంటిలేటర్ ను అమర్చలేదని స్పష్టం చేసిన వైద్యులు, ఆయన వయసు, శారీరక సమస్యలను దృష్టిలో ఉంచుకుని చికిత్సను అందిస్తున్నట్టు వెల్లడించారు. సరైన ట్రీట్ మెంట్ తో ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు.

కాగా, 1982లో 'కూలీ' చిత్రం షూటింగ్ సమయంలో అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయనకు కాలేయ సంబంధిత సమస్యలు ప్రారంభమయ్యాయి. క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో గత నాలుగు దశాబ్దాలుగా ఆయన తన రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయన, త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు పలువురు వెల్లడించారు.

More Telugu News