వికాస్ దూబే హతమవడంపై అన్ని విషయాలూ చెప్పాల్సిన అవసరం లేదు... యూపీ ఏడీజీ!

12-07-2020 Sun 07:21
  • ప్రతి ఒక్కరికీ ఎందుకు సమాధానాలు చెప్పాలి
  • చెప్పాల్సిన వారికి మాత్రమే చెబుతాం
  • ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్
No Need to tell All in Vikas Dubey Encounter

యూపీలో కలకలం సృష్టించిన వికాస్ దూబే ఎన్ కౌంటర్ కు సంబంధించిన అన్ని విషయాలూ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తమను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎందుకు సమాధానాలు చెప్పాలని అడిగిన ఆయన, తాము ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోతే, ప్రతి విషయంలోనూ ప్రశ్నలు వస్తాయని, ఈ ఘటనలో అందరికి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. వికాస్ దూబే ఎన్ కౌంటర్ విషయంలో చెప్పాల్సిన వారికి మాత్రమే వివరాలను అందిస్తామని తెలిపారు.