పవన్ కల్యాణ్ తొలి సూపర్ హిట్ విడుదలైన తేదీనే 'పవర్ స్టార్'!

12-07-2020 Sun 06:14
  • ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి
  • జూలై 24న ఓటీటీలో విడుదల!
  • సోషల్ మీడియాలో వార్తలు
Social Media Says Power Star Releasing on July 24th

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరెత్తకుండానే, ఆయన జీవిత చరిత్రలో ఓ భాగాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్లను, షూటింగ్ చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఇక, ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన, సినిమా విడుదల తేదీపైనా ఓ నిర్ణయానికి వచ్చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పవన్ కల్యాణ్ నటించిన 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి', 'గోకులంలో సీత' వంటి సినిమాల తరువాత తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, పవన్ స్టామినాను ఫ్యాన్స్ కు తెలిపిన 'తొలిప్రేమ' చిత్రం విడుదలైన జూలై 24నే తాను నిర్మిస్తున్న 'పవర్ స్టార్'ను విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారట. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వర్మ నుంచి వెలువడలేదు.