Tamil Nadu: 15 అడుగుల కింగ్ కోబ్రాను కాపాడిన అటవీ సిబ్బంది

  • కోయంబత్తూరు సమీపంలోని గ్రామంలో కింగ్ కోబ్రాను రక్షించిన అటవీ సిబ్బంది
  • బయో డైవర్సిటీ హబ్ గా ఈ ప్రాంతానికి గుర్తింపు
  • అత్యంత పొడవైన విష సర్పాలకు ఈ ప్రాంతం నెలవు
15 feet King Cobra rescued by forest officials in Tamil Nadu

కింగ్ కోబ్రాను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎంతో పొడవైన శరీరంతో, నిగనిగలాడూతూ, అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ రాచనాగును చూడంగానే సగం ప్రాణం పోయినట్టనిపిస్తుంది. అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన ఈ కింగ్ కోబ్రాను అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఈ రాచనాగు ఏకంగా 15 అడుగుల పొడవు ఉంది. తమిళనాడు, కోయంబత్తూరు సమీపంలోని నరసీపురం గ్రామంలో ఈ సర్పాన్ని కాపాడారు. వెల్లియంగిరి పర్వత ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి బయో డైవర్సిటీ హబ్ గా గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అత్యంత పొడవైన విషపూరిత సర్పాలకు ఈ ప్రాంతం నెలవుగా ఉంది.

ఈ సర్పాన్ని పట్టుకున్న అటవీ సిబ్బంది... దాన్ని సిరువాని అడవుల్లో సురక్షితంగా వదిలేశారు. ఇదే ప్రాంతంలో ఇటీవల ఒక ఇంట్లో అత్యంత విషపూరితమైన రక్తపింజరిని గుర్తించారు. తమ ఇంటి బాత్రూమ్ లో పాము ఉందనే విషయాన్ని గ్రహించిన ఇంటి యజమాని... స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించాడు. ఆ తర్వాత ఆయన వచ్చి పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ మరెన్నో పాములకు ఆ పాము జన్మనిచ్చింది. వీటిని చూసి అక్కుడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు.

More Telugu News