కరోనా పరీక్షలు చేయించుకున్న అసదుద్దీన్ ఒవైసీ

11-07-2020 Sat 19:19
  • యునానీ ఆసుపత్రికి వెళ్లిన ఒవైసీ
  • పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన ఎంఐఎం అధినేత
  • ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచన
Asaduddin takes corona test

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో కరోనా పరీక్షలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఆయన యునానీ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అక్కడే టెస్టులు చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులను ఈరోజు చేయించుకున్నానని ఒవైసీ చెప్పారు. తన టెస్టు ఫలితాలు నెగెటివ్ గా వచ్చాయని తెలిపారు. దక్షిణ హైదరాబాదులో దాదాపు 30 టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయని... ప్రతి ఒక్కరూ ఎలాంటి సంకోచాలు లేకుండా పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.