నా ఆరోగ్యం పట్ల స్పష్టత కావాలంటే నేరుగా నాకే ఫోన్ చేయండి: సుద్దాల అశోక్ తేజ

11-07-2020 Sat 19:07
  • కొన్నివారాల కిందట సుద్దాలకు కాలేయ శస్త్రచికిత్స
  • ఆయన ఆరోగ్యంపై వదంతులు
  • వీడియో సందేశం వెలువరించిన సుద్దాల
Suddala Ashok Teja says that he is doing fine

ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజకు కొన్ని వారాల కిందట కాలేయ శస్త్రచికిత్స జరిగింది. అయితే, తన ఆరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయంటూ సుద్దాల అశోక్ తేజ స్పందించారు. ప్రస్తుతం తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా వదంతులు వస్తున్నాయని వెల్లడించారు.  "నేను బాగానే ఉన్నాను. ఎవరికైనా నా ఆరోగ్యం పట్ల స్పష్టత కావాలనుకుంటే నేరుగా నాకే ఫోన్ చేయవచ్చు. పుకార్లను నమ్మవద్దు. నాకు ఆపరేషన్ జరిగి 47 రోజులు అవుతోంది. క్రమంగా కోలుకుంటున్నాను" అంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు.