చాలామందికి కఠిన పరిస్థితుల్లో విధి నిర్వహణ అత్యంత తృప్తిని ఇస్తుంది: చిరంజీవి

11-07-2020 Sat 18:47
  • తమిళనాడు పోస్ట్ మ్యాన్ పై చిరంజీవి స్పందన
  • ధన్యజీవులు అంటూ ట్వీట్
  • ఇటీవలే పదవీ విరమణ చేసిన పోస్ట్ మ్యాన్ శివన్
Chiranjeevi praises Tamilnadu postman Shivan

తమిళనాడుకు చెందిన డి.శివన్ అనే పోస్ట్ మ్యాన్ ఇటీవలే పదవీ విరమణ చేశాడు. అయితే శివన్ జాతీయస్థాయిలో గుర్తింపు పొందడానికి బలమైన కారణం ఉంది. శివన్ ఇన్నేళ్లపాటు బాధ్యతలు నిర్వహించింది ఏ పట్టణ ప్రాంతంలోనో కాదు... క్రూరమృగాలకు ఆవాసమైన దట్టమైన కూనూర్ అటవీ ప్రాంతంలో. నిత్యం 15 కిలోమీటర్ల పాటు అటవీప్రాంతంలో వివిధ కుగ్రామాలకు తిరుగుతూ, ఉత్తరాలు బట్వాడా చేసిన శివన్ సాహసాన్ని ఇటీవల ఓ జాతీయ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. "ఇలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. కొందరికి ఎన్ని కష్టాలు ఎదురైనా తమ విధి నిర్వహణే వారికి అత్యంత తృప్తిని ఇస్తుంది. ఇలాంటి ధన్యజీవులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మానవత ఉన్నతీకరణ చెందుతోంది" అంటూ ట్వీట్ చేశారు.