శశికళ జైలు నుంచి బయటకు వచ్చినా.. పార్టీలో చోటివ్వం: అన్నాడీఎంకే 

11-07-2020 Sat 16:48
  • శశికళకు పార్టీలో స్థానం లేదు
  • ఇతరులు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటాం
  • ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా మాకు అనవసరం
There is no place for Sasikala in our party says AIADMK

దివంగత జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో శశికళకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. శశికళపై పార్టీ విధించిన నిషేధం కొనసాగుతుందని చెప్పారు. ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా తమకు అనవసరమని, ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా పార్టీలో మాత్రం చోటు లేదని తెలిపారు. శశికళకు చెందిన కుటుంబం మినహా... పార్టీలో ఎవరైనా చేరొచ్చని చెప్పారు.