మంత్రి గంగుల కమలాకర్ కాన్వాయ్ లో వాహనం బోల్తా... తెగిపడిన ఎస్సై బొటనవేలు!

11-07-2020 Sat 16:34
  • కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద ఘటన
  • అదుపుతప్పి బోల్తా పడిన ఎస్కార్ట్ వాహనం
  • కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ కు గాయాలు
Gangula Kamalakar Escort vehicle overturned as SI injured

మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి వస్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ గాయపడ్డారు. ఆయన బొటనవేలు తెగిపడినట్టు సమాచారం. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లోని ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద ఈ ఘటన జరిగింది.