ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆయుధాలను పరీక్షించిన డీజీపీ గౌతమ్ సవాంగ్

Sat, Jul 11, 2020, 04:18 PM
AP DGP Gautam Sawang visits APSP firing range at Mangalagiri
  • కమాండో దుస్తుల్లో ఏపీ డీజీపీ
  • షార్ట్ వెపన్స్ ను పరిశీలించిన వైనం
  • ఫైరింగ్ రేంజ్ లో నైపుణ్యాన్ని పరీక్షించుకున్న సవాంగ్
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు చెందిన ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ కమాండో దుస్తుల్లో కొత్తగా కనిపించారు. ప్రత్యేక బలగాలకు అందించే అత్యాధునిక షార్ట్ వెపన్స్ ను ఆయన పరీక్షించారు. ఓ అత్యాధునిక తుపాకీని లక్ష్యానికి ఎక్కుపెట్టి పలు రౌండ్లు కాల్చారు. అంతేకాదు, ఎడమ చేత్తో పిస్టల్ పట్టుకుని తన నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad