దళితులకు అన్యాయం చేసింది ఎవరు వర్ల?: విజయసాయిరెడ్డి

11-07-2020 Sat 16:03
  • నీకు అన్యాయం చేసింది ఎవరు వర్ల?
  • చంద్రబాబుకు వర్తమానం, భవిష్యత్తు రెండూ లేవు
  • పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు
Who deceived you varla asks Vijayasai Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ కీలక నేత వర్ల రామయ్యపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వర్ల గురించి కామెంట్ చేస్తూ... 'మాట్లాడితే దళిత నాయకుడిని అంటావ్. అంబేద్కర్ స్మృతి వనాన్ని జగన్ ప్రభుత్వం కట్టాలని ప్రతిపాదిస్తే ఎలా కడతారని ప్రశ్నిస్తావ్. దళితులకు అన్యాయం చేసింది ఎవరు వర్ల? పోనీ నీకు అన్యాయం చేసింది ఎవరు?' అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... చరిత్రలో చిరిగిన కాగితం చంద్రబాబు అని విజయసాయి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వర్తమానం, భవిష్యత్తు రెండూ లేవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నలు చెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడని అన్నారు. లక్షల ఇళ్లను నిర్మించామని చెప్పుకుంటున్నారని... అదే నిజమైతే, పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా? అని ప్రశ్నించారు. లేని నగరాన్నే గ్రాఫిక్ లో సృష్టించినోడివని అంటూ ఎద్దేవా చేశారు.