హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టనున్న అమితాబ్ బచ్చన్ మనవడు

11-07-2020 Sat 13:36
  • అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్‌ నందా కుమారుడు అగస్త్య 
  • ఓ సినిమాలో హీరోగా కనపడనున్నట్లు సమాచారం
  • బాల్యం నుంచే సినిమాల్లోకి రావాలన్న కోరిక  
Amitabh Grandson Agastya Gears up for his Bollywood Debut

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం నుంచి మరో వ్యక్తి సినీరంగ ప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్‌ నందా కుమారుడు అగస్త్య నందా ఓ సినిమాలో హీరోగా కనపడనున్నట్లు సమాచారం. అగస్త్యకు బాల్యం నుంచే సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉండేది.

అమితాబ్‌ బచ్చన్‌ వంటి పెద్ద కుటుంబం నుంచి వస్తుండడంతో పాటు, అగస్త్యకు సామాజిక మాధ్యమాల్లోనూ భారీగా ఫాలోవర్లు ఉండడంతో ఆయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం సినిమా కథలు వింటున్నాడని తెలుస్తోంది. తనకు నచ్చిన కథతో హీరోగా బాలీవుడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మరోవైపు, అగస్త్య సోదరి నవ్య నవేలీ నందా మోడల్‌గా రాణిస్తోంది. అమితాబ్‌ కుటుంబంలో దాదాపు అందరూ సినీనటులే.