మీకు మరిన్ని ఉన్నత పదవులు లభించాలని కోరుకుంటున్నా: పవన్ కల్యాణ్

11-07-2020 Sat 12:57
  • నేడు బండి సంజయ్ పుట్టినరోజు
  • బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్
  • ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్ష
Pawan Kalyan birthday wishes to Bandi Sanjay

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన బండి సంజయ్... పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారు. పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకువస్తూ... ప్రభుత్వానికి దీటుగా బీజేపీని నిలిపేందుకు యత్నిస్తున్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి... ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.

'బండి సంజయ్ గారికి, నా తరపున, జనసైనికుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. యాదగిరి నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఇరువురు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవలు అందించేలా, ఇంకా ఉన్నత పదవులు మీకు లభించాలని కోరుకుంటున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశారు.