మరో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ 'బుట్ట‌బొమ్మ' పాట

11-07-2020 Sat 12:26
  • అదరగొట్టిన అల్లు అర్జున్, పూజా హెగ్డే స్టెప్పులు
  • 'బుట్ట‌బొమ్మ' పాటకు‌ 260 మిలియన్లకు పైగా వ్యూస్
  • తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌
  • హర్షం వ్యక్తం చేసిన పూజా హెగ్డే  
buttabommna song creates record

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు అదరగొట్టేసిన విషయం తెలిసిందే. ఆ పాటకు, వారి డ్యాన్సుకు ప్రేక్షకులు ఇప్పటికీ మంత్ర ముగ్ధులైపోతున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట కోట్లాది వ్యూస్‌ సాధిస్తూ అల్లు అర్జున్ అభిమానులను మరింత ఖుషీ చేస్తోంది.

థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ 'బుట్ట‌బొమ్మ' పాట‌ 260 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు, ఈ వీడియోకు 1.9 మిలియ‌న్స్ లైకులు వచ్చాయి. ఈ విషయాలను తెలుపుతూ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టర్‌ పోస్ట్ చేసింది.

దీనిపై స్పందించిన పూజా హెగ్గే అన్ని రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్నాయని, అల్లు అర్జున్‌తో పాటు తాను ఈ పాటకు డ్యాన్స్‌ చేయ‌డానికి మ‌న‌సు పెట్టి కష్టపడి పనిచేశామని తెలిపింది. ఈ సాంగ్‌‌కి ఇంత గొప్ప స్పందన వస్తోంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది.