దేశంలో గత వందేళ్లలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి: ఆర్బీఐ గవర్నర్

11-07-2020 Sat 11:34
  • దేశ వ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి
  • ఉపాధి, ఇతర రంగాలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది
  • ఆర్థిక వృద్ధి,  స్థిరత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం
  • కరోనా వల్ల తలెత్తే సంక్షోభాలను గుర్తిస్తున్నాం
Economic Growth Top Priority Says RBI Governor Shaktikanta Das

కరోనా విజృంభణ కారణంగా దేశ వ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, వందేళ్లలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్యాంకింగ్‌, ఎకనమిక్స్ కాన్‌క్లేవ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు.

దేశంలో ఆర్థిక స్థిరత్వానికి అనేక చర్యలు చేపట్టామని శక్తికాంత దాస్ వివరించారు. ఉపాధి, ఇతర రంగాలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి,  స్థిరత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల తలెత్తే అవకాశమున్న సంక్షోభాలను గుర్తించి అవి రాకుండా చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని సంప్రదాయ, అసాధారణ చర్యలు తీసుకుంటూ మార్కెట్‌ తిరిగి పుంజుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.