Make in India: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం భారత్ గ్లోబల్ టెండర్లు.. దక్కించుకునేందుకు చైనా కంపెనీ ఆరాటం!

China Company Fray In Vande Bharat Express Globel Tenders
  • రూ. 1500 కోట్ల విలువైన టెండర్‌కు చైనా సంస్థ దరఖాస్తు
  • 44 ప్రొపల్షన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన భారత్
  • మేకిన్ ఇండియాలో భాగంగా ఇది మూడో టెండర్
భారత్ సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ కోసం ప్రభుత్వం పిలిచిన రూ. 1500 కోట్ల విలువైన గ్లోబల్ టెండర్లను దక్కించుకునేందుకు చైనా ప్రభుత్వ కంపెనీ పోటీ పడుతోంది. సెమీ హైస్పీడ్ రైలు తయారీలో భారతీయ రైల్వేకు ప్రొపల్షన్ సిస్టం అవసరం. దీంతో 44 ప్రొపల్షన్ల కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. చైనా ప్రభుత్వ సంస్థ అయిన సీఆర్ఆర్‌సీ పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్‌లో పాల్గొంటూ దరఖాస్తు చేసింది.

గురుగ్రామ్‌లోని ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సీఆర్ఆర్ఏ కంపెనీ తమ రెండు సంస్థలు  కలిసి పనిచేస్తాయని పేర్కొంది. కాగా, గ్లోబల్ టెండర్లలో చైనా కంపెనీని కూడా చేర్చినట్టు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ‘మేకిన్ ఇండియా’ ఇనిషియేషన్‌లో భాగంగా ఈ రైళ్లకు ఇది మూడో టెండర్ కావడం గమనార్హం. భారత్-చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు చైనా సంస్థ పోటీపడడం, రైల్వో బోర్డు దీనిపై సానుకూలంగా స్పందించడం గమనార్హం.
Make in India
Indian Railways
China
globel tenders

More Telugu News