బాలకృష్ణ సరసన ముంబై మోడల్!

11-07-2020 Sat 09:01
  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో సినిమా  
  • కొత్త హీరోయిన్ ని ఎంపిక చేస్తామన్న దర్శకుడు
  • హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన
Mumbai model for Balakrishna movie

బాలకృష్ణ సినిమా అనగానే హీరోయిన్ల సందడి కూడా బాగానే వుంటుంది. ఎందుకంటే, ఆయన సినిమాల్లో గ్లామర్ కి, పాటలకు కూడా ఎక్కువ స్కోప్ వుంటుంది. అందుకే, మంచి ఫామ్ లో వున్న టాప్ హీరోయిన్లనే ఆయన సినిమాలకు హీరోయిన్లుగా ఎంచుకుంటూ వుంటారు. అయితే, తాజాగా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న తాజా మూడో చిత్రానికి సంబంధించి ఇంతవరకు హీరోయిన్ ఎంపిక పూర్తికాలేదు. ఇంతకుముందు కొందరి పేర్లు వినిపించినా అవన్నీ ఒట్టిదేనని దర్శకుడు బోయపాటి కొట్టిపారేశారు. పైపెచ్చు ఇందులో కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తామంటూ ఆయన ప్రకటించారు కూడా.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక అందమైన మోడల్ ని బాలకృష్ణ సరసన కథానాయికగా పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం ముంబై మోడళ్లను సంప్రదిస్తున్నట్టు, త్వరలోనే ఒక అమ్మాయిని ఫైనల్ చేయనున్నట్టు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది. ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. బోయపాటి మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతోంది.