Mumbai: కరోనాకు అడ్డుకట్ట వేయగలమని చెప్పేందుకు ధారావి ఓ ఉదాహరణ: డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు

  • వైరస్‌ను ఎలా నియంత్రించవచ్చో ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా ధారావి నిరూపించాయి
  • లాక్‌డౌన్ సడలింపుల వల్లే కేసుల్లో పెరుగుదల
  • ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌కు చెక్ పెట్టొచ్చు
WHO praises Dharavi Model

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారావిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసల జల్లు కురిపించింది. వైరస్ ఎంతగా చెలరేగిపోయినా అడ్డుకట్ట వేయగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా నేడు కరోనా మహమ్మారి బారి నుంచి ధారావి బయటపడిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. వైరస్ ఎంతగా వ్యాప్తి చెందినప్పటికీ నియంత్రించగలమని ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ధారావి నిరూపించాయని అన్నారు.

కరోనా టెస్టులు ముమ్మరం చేయడం, సామాజిక దూరం పాటించడం, రోగులకు తక్షణ చికిత్స అందించడం కారణంగా కరోనాతో జరిగిన యుద్ధంలో ధారావి విజయం సాధించిందని అధనోమ్ అన్నారు. లాక్‌డౌన్ సడలింపుల కారణంగా పెరుగుతున్న కేసులను ప్రజల భాగస్వామ్యంతో చెక్ పెట్టవచ్చన్నారు. ధారావిలో ప్రస్తుతం 166 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు బీఎంసీ అధికారులు తెలిపారు.

More Telugu News