సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

11-07-2020 Sat 07:29
  • శ్రుతి హాసన్ ఖాళీగా లేదు కదా!
  • వెబ్ సీరీస్ చేస్తున్న విజయ్ సేతుపతి 
  • హిందీ రీమేక్ కి హరీశ్ శంకర్ డైరెక్షన్ 
Shruti Hassan makes herself a face mask

*  లాక్ డౌన్ లో ఖాళీగా ఉండకుండా తారలంతా ఏదో ఒక పని చేస్తూనే వున్నారు. కథానాయిక శ్రుతి హాసన్ కూడా అలాగే తన కిష్టమైన సంగీతంలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటోంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సొంతంగా అందమైన ఫేస్ మాస్క్ కూడా తయారుచేసుకుందట. 'ఎవరికి వాళ్లు ఇలా మాస్క్ తయారుచేసుకుంటే థ్రిల్ గా వుంటుంది. మనకూ టైం పాస్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి' అంటూ అభిమానులకు సలహా కూడా ఇస్తోంది.
*  తెలుగులో పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్న తమిళ చిత్ర కథానాయకుడు విజయ్ సేతుపతి కూడా త్వరలో డిజిటల్ ప్లాట్ ఫాం పైకి వస్తున్నాడు. తాజాగా రెండు వెబ్ సీరీస్ లలో నటించడానికి ఆయన అంగీకరించాడట. ఓపక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క వెబ్ సీరీస్ లలో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
*  తెలుగులో అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం' (డీజే) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ కానీ, టైగర్ ష్రాఫ్ కానీ నటిస్తారని తెలుస్తోంది. ఇక హరీశ్ శంకర్ దీనికి కూడా దర్శకత్వం వహించే ఛాన్స్ వుంది.