Jaggareddy: సంగారెడ్డి వర్తకసంఘం ప్రెసిడెంట్ మృతి... రేపటి దీక్ష వాయిదా వేసిన జగ్గారెడ్డి

  • వర్తక సంఘం అధ్యక్షుడు సూరి మరణం
  • కరోనాతో చనిపోయాడో, గుండెపోటో తెలియడంలేదన్న జగ్గారెడ్డి
  • దీక్ష ఎప్పుడు చేపట్టేది మరికొన్నిరోజుల్లో వెల్లడి
Congress MLA Jaggareddy fires in Medak MP

సంగారెడ్డి వర్తక సంఘం అధ్యక్షుడు సూరి ఈ రోజు ఉదయం మరణించారని, దాంతో రేపు తాను చేపట్టాల్సిన దీక్షను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. దీక్ష ఎప్పుడు చేసేది మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. సూరి మృతికి కరోనా కారణమో కాదో తెలుసుకునే పరిస్థితి కూడా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో లేదని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

గుండెపోటుతో, శ్వాస సంబంధ సమస్యలతో చనిపోయారని చెబుతున్నారని, ఆయన మరణంపై సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. కరోనా అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకోలేదని, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలోపే చనిపోయారని తెలిపారు. సంగారెడ్డి ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయాలు లేవని ఆరోపించారు. ఓ వైపు పరిస్థితి ఇలావుంటే మెదక్ ఎంపీ ఏమైపోయాడంటూ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జగ్గారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. మెదక్ ఎంపీ ఎక్కడా కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News