సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ సోదరి

10-07-2020 Fri 20:51
  • కృష్ణంరాజు వారసుడిగా ఇప్పటికే సత్తా చాటిన ప్రభాస్
  • నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న కుమార్తె ప్రసీద
  • సోదరికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న ప్రభాస్
Prabhas sister entering Tollywood

సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబం నుంచి మరొకరు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన సోదరుడి కుమారుడు ప్రభాస్ జాతీయ స్థాయిలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతున్నారు. నిర్మాతగా ఆమె అడుగుపెట్టనున్నారు.

 ప్రభాస్ 20వ చిత్రం 'రాధే శ్యామ్' నిర్మాతల్లో ఆమె కూడా ఒక నిర్మాత కావడం గమనార్హం. ఈ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్ తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. ప్రమోద్ కూడా కృష్ణంరాజు బంధువే. నిర్మాతగా వ్యవహరిస్తూనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టే యోచనలో ప్రసీద ఉన్నారట. ప్రభాస్ తన సోదరికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు.