సీఎంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇలాగే వ్యవహరిస్తారా?: పట్టాభి

10-07-2020 Fri 19:49
  • దర్యాప్తు లేకుండా కొల్లుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న పట్టాభి
  • ఉద్దేశపూర్వకంగా హత్య కేసులో ఇరికించారని ఆరోపణ
  • రిమాండ్ రిపోర్టు అబద్ధాలమయం అని వెల్లడి
Pattabhi questions over Kollu Ravindra arrest

టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశపూర్వకంగానే హత్య కేసులో ఇరికించారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండానే కొల్లు రవీంద్ర పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని తెలిపారు.

ఎస్పీ కార్యాలయంలో ఉన్న వ్యక్తి ఫోన్ లో ముద్దాయిలతో ఎలా మాట్లాడతాడని పట్టాభి ప్రశ్నించారు. దర్యాప్తు చేయకుండానే అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. రిమాండ్ రిపోర్టులో ఉన్నవన్నీ అసత్యాలేనని అన్నారు. ఈ కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇలాగే విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు.