ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. హైదరాబాదులో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

10-07-2020 Fri 17:54
  • ఉరేసుకుని చనిపోయిన కానిస్టేబుల్ సాయిచంద్
  • ఇటీవలే పెళ్లి నిశ్చయం
  • బంధువుల అమ్మాయితో పెళ్లిని వ్యతిరేకించిన సాయిచంద్
Police constable hanged to death in Hyderabad

హైదరాబాదు శివార్లలోని మేడిపల్లిలో ఓ పోలీసు కానిస్టేబుల్ బలవర్మరణం చెందాడు. 27 ఏళ్ల నాగ సాయిచంద్ తాను అద్దెకుంటున్న ఇంట్లోనే సీలింగ్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద శబ్దం రావడంతో సాయిచంద్ రూమ్ కు వెళ్లి చూసిన ఇంటి యజమానికి సీలింగ్ కు ఉరివేసుకున్న స్థితిలో సాయిచంద్ కనిపించాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ములుగు జిల్లాకు చెందిన నాగ సాయిచంద్ 2018 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్. ప్రస్తుతం మేడిపల్లి పీఎస్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.  కుటుంబ సభ్యులు అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, తన ఇష్టానికి వ్యతిరేకంగా బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారన్న ఆవేదనతో సాయిచంద్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.