'ఫైటర్' విషయంలో మనసు మార్చుకున్న పూరి!

10-07-2020 Fri 17:45
  • విజయ్ దేవరకొండ హీరోగా పూరి 'ఫైటర్'
  • తెలుగు, హిందీ భాషల్లో నిర్మాణం
  • ముంబైలో ప్రత్యేక సెట్లో షూటింగ్
  • హైదరాబాదుకి షిఫ్ట్ అవుతున్న షూట్
Puri Jagannath shifts his shoot to Hyderabad

'ఫైటర్' షూటింగ్ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ మనసు మార్చుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'ఫైటర్' పేరుతో ఓ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఏకకాలంలో హిందీలో కూడా నిర్మిస్తున్నారు. హిందీ వెర్షన్ కి సంబంధించి కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ చిత్రకథ ముంబై నగర నేపథ్యంలో సాగుతుంది. దాంతో చాలా భాగం షూటింగ్ ఇప్పటికే ముంబైలో నిర్వహించారు. దీని కోసం అక్కడ ఓ భారీ సెట్ కూడా వేశారు. లాక్ డౌన్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముంబైలో షూటింగును ప్రారంభిద్దామని పూరి జగన్నాథ్ అనుకున్నారు. అయితే, ఇప్పుడు కరణ్ జొహార్, విజయ్ దేవరకొండ సూచనలపై షూటింగును హైదరాబాదుకు షిఫ్ట్ చేస్తున్నారట. ఈ క్రమంలో ముంబైలో వున్న సెట్ ను తీసేసి, హైదరాబాదులో కొత్తగా అదే సెట్స్ ను వేస్తారని సమాచారం.