జగన్ గారూ.. మంత్రి వెల్లంపల్లి నుంచి దేవుడిని, దేవుడి స్థలాలను కాపాడండి: కేశినేని నాని

10-07-2020 Fri 16:56
  • విజయవాడలో దేవుడి స్థలం కబ్జా అవుతోందంటూ పత్రికలో కథనం
  • మంత్రి చక్రం తిప్పుతున్నారని పేర్కొన్న పత్రిక
  • జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేసిన కేశినేని
save god from minister Vellampalli says Kesineni Nani

విజయవాడలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన సత్యనారాయణపురంలో 900 గజాల స్థలం కబ్జాకు గురవుతోందంటూ ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం కలకలం రేపుతోంది. ఈ స్థలం విలువ రూ. 10 కోట్లు ఉంటుందని చెపుతున్నారు. ఓ మంత్రి తెరవెనుక ఉండి చక్రం తిప్పారని సదరు పత్రిక పేర్కొంది.

ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'ముఖ్యమంత్రి గారూ... దయచేసి మీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నుంచి దేవుడిని, దేవుడి స్థలాలను కాపాడండి' అంటూ కేశినేని ట్వీట్ చేశారు. దీంతో పాటు సదరు పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.