వైఎస్ఆర్‌ సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

10-07-2020 Fri 16:38
  • పిటిషన్ వేసిన అన్నా వైయస్ఆర్ పార్టీ నేత బాషా
  • యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుకు బదులుగా తమ పేరు వాడుతున్నారని ఆరోపణ
  • ఇదే విషయంపై ఇటీవల నిలదీసిన రఘురాజు
Petition filed in Delhi high court on YSRCP name

ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను అన్నా వైయస్ఆర్ పార్టీ నేత బాషా దాఖలు చేశారు. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి బదులుగా వైయస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఇదే పేరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వైయస్ఆర్సీపీ పేరుపై ఇచ్చిన షోకాజ్ నోటీసుపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ పేరుతో తనకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.