పెరుగుతున్న కరోనా కేసులు.. నష్టపోయిన మార్కెట్లు

10-07-2020 Fri 16:05
  • 143 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 45 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు లాభపడ్డ రిలయన్స్ ఇండస్ట్రీస్
Stock Markets ends in losses due to increasing corona cases

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. దీంతో, వారు అమ్మకాలకు మొగ్గుచూపడంతో... ఈరోజు ఆద్యంతం సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 36,594కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 10,768 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.95%), సన్ ఫార్మా (2.36%), హిందుస్థాన్ యూని లీవర్ (2.22%), భారతి ఎయిర్ టెల్ (1.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.44%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-3.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.13%), టైటాన్ కంపెనీ (-3.01%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.87%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.75%).