తన తల్లి గురించి దిల్ రాజు కుమార్తె భావోద్వేగం

10-07-2020 Fri 15:40
  • కొంత కాలం క్రితం తొలి భార్యను కోల్పోయిన దిల్ రాజు
  • ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న రాజు
  • ఈరోజు ఆయన భార్య జయంతి
Dil Raju daughter shares emotional message

తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు మొదటి భార్య కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన తేజస్విని అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని దిల్ రాజు కుమార్తె హన్షిత దగ్గరుండి జరిపించారు. ఒంటరితనంతో బాధపడుతున్న తన తండ్రికి ఒక తోడు ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ పని చేశారు.

మరోవైపు ఈ రోజు తన తల్లి జయంతి సందర్భంగా హన్షిత ఒక భావోద్వేగ పోస్టును పెట్టారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నిన్న చాలా మిస్ అవుతున్నా. నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. నీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నీతోనే నేను ఎక్కువ ఫొటోలు దిగాను. నీ దృష్టిలో ప్రేమ అంటే.. ఎప్పటిలాగానే నన్ను గట్టిగా కౌగిలించుకోవడం' అంటూ ఎమోషనల్ అయ్యారు. తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అమ్మతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.