'మిడిల్ క్లాస్ మెలోడీస్' అంటున్న విజయ్ దేవరకొండ తమ్ముడు

10-07-2020 Fri 13:40
  • ఆనంద్ దేవరకొండ రెండో చిత్రానికి టైటిల్ ఖరారు 
  • వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ
  • భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో చిత్రం
Anand Devarakonda second movie title fixed

తన సోదరుడు విజయ్ దేవరకొండ బాటలోనే చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ రెండో చిత్రానికి టైటిల్ ఫిక్సయింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే పేరు ఖరారు చేశారు. 'దొరసాని' చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఆనంద్ ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే ఈ యూత్ ఫుల్ చిత్రానికి వినోద్ అనంతోజు దర్శకుడు. దర్శకుడిగా వినోద్ కు ఇది తొలి సినిమా. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ స్వీకార్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.