'శివ' లోగోలో సైకిల్‌ చైన్ వాడాను.. 'పవర్ స్టార్' లోగోలో ఇది వాడాను.. అంతే!: వర్మ

10-07-2020 Fri 13:34
  • 'పవర్ స్టార్' పేరిట సినిమా
  • లోగోలో గ్లాస్‌ గుర్తు వాడడంపై క్లారిటీ
  • శివ సినిమాలో హీరో చైన్ వాడతాడు
  • 'పవర్ స్టార్' హీరో పదే పదే టీ తాగుతాడు
  • పుస్తకాలు కూడా చదువుతాడు
My POWER STAR drinks tea and reads books

దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' పేరిట సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పోస్టర్ల‌ను ఆయన ఇప్పటికే విడుదల చేశారు. అయితే, వీటిల్లో జనసేన పార్టీ గుర్తు గ్లాసు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చదివే పుస్తకాలు ఉండడంతో దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు.  
                     
'పవర్ స్టార్‌ లోగోలో టీ గ్లాస్‌ ఉంచాం.. ఎందుకంటే ఇందులో హీరో పదేపదే టీ తాగుతాడు. అంతేకానీ, ఇది ఏ రాజకీయ విషయాలకు సంబంధించినది కాదు. శివ సినిమా లోగోలో నేను సైకిల్‌ చైన్ ఉపయోగించాను.. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పదే పదే దానితో రౌడీలను కొడతాడు.. అంతే..' అని చెప్పారు. ఈ సినిమాలో 'నా పవర్‌ స్టార్‌ టీ తాగడంతో పాటు పుస్తకాలు చదువుతాడు' అని తెలిపారు.