కండలు పెంచుతున్న యంగ్‌ హీరో.. ఫొటో వైరల్

10-07-2020 Fri 13:11
  • ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన నిఖిల్‌
  • సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నం
  • కొత్త సినిమా కోసమేనని టాక్
nikhil pic viral

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కండలు పెంచుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లోనే ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న ఆయన వ్యాయామం మీద దృష్టి పెట్టాడు.

సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోజు ఇస్తూ ఫొటో తీసుకున్నాడు. ఓ ట్రైనర్ పర్యవేక్షణలో ఆయన కండలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'కార్తికేయ 2'లో నటిస్తున్నాడు. మరోవైపు, 18 పేజీస్ అనే సినిమాను కూడా చేయనున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సిక్స్‌ ప్యాక్ తో కనపడనున్నట్లు టాక్. ఈ సినిమా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది.