ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా.. స్వీయ నిర్బంధంలో రోజా!

10-07-2020 Fri 12:57
  • చిత్తూరు జిల్లా నగరిలో కలకలం
  • గన్ మెన్ కాంటాక్టులను సేకరిస్తున్న అధికారులు
  • ఏపీలో 23 వేలను దాటిన కరోనా కేసులు
Roja gunman tested corona positive

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కరోనా బారినపడ్డారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు  కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. రోజాతో కలిసి ఇన్ని రోజులు ఆయన ట్రావెల్ చేశారు. గన్ మెన్ కు కరోనా సోకడంతో రోజా తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. గన్ మెన్ కు కాంటాక్ట్ లో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. రోజా కూడా కరోనా పరీక్షలను చేయించుకోనున్నారు.