గత ప్రభుత్వం ఎలా లీజు పొడిగించిందో వివరిస్తే బాగుంటుంది: ఐవైఆర్ కృష్ణారావు

10-07-2020 Fri 12:38
  • దేవాదాయ స్థలాల మీద ప్రేమ ఆహ్వానించదగిన విషయం
  • దుర్గా మల్లేశ్వర స్వామి భూములపై కూడా వివరాలు తెలపాలి
  • సిద్ధార్థ సంస్థల వారు ఎలా కొట్టేశారో చెప్పాలి
iyr krishna rao on a news report

అత్యంత ఖరీదైన దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ఓ వార్తపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. 'శివయ్య స్థలం స్వాహాయ' పేరుతో ప్రచురితమైన ఆ కథనాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. విజయవాడలో ఓ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి చక్రం తిప్పుతూ 10 కోట్ల రూపాయల విలువైన 900 గజాలు స్వాహా చేస్తున్నారని ఆ పత్రిక బయట పెట్టడం మంచి విషయమేనని చెప్పారు.  

'సంతోషం.. ఆంధ్రజ్యోతి వారికి దేవాదాయ స్థలాల మీద ఇంత ప్రేమ ఆహ్వానించదగిన విషయం. పనిలో పని 40 ఏళ్ల నుంచి అత్యంత విలువైన దుర్గా మల్లేశ్వర స్వామి భూములు సిద్ధార్థ సంస్థల వారు ఎలా కొట్టేశారో కేబినెట్ ద్వారా గత ప్రభుత్వం ఎలా లీజు పొడిగించిందో వివరిస్తే బాగుంటుంది' అని ఐవైఆర్‌ కృష్ణారావు సూచన చేశారు.