చైనాతో ఉద్రిక్తతలు.. ఒప్పో కంపెనీ యాడ్ ను వదులుకున్న బాలీవుడ్ హీరో

10-07-2020 Fri 12:36
  • చైనా యాప్ లను ఇప్పటికే నిషేధించిన భారత్
  • చైనా వస్తువులను బహిష్కరిస్తున్న ప్రజలు
  • ఒప్పోతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కార్తీక్ ఆర్యన్
Acror Karthik Aryan stops contract with Oppo
భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఉద్రిక్తత తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ... డ్రాగన్ కంట్రీని పూర్తిగా నమ్మే పరిస్థితులు మాత్రం లేవు. చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించింది. ప్రజలు కూడా చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఈ జాబితాలో చేరారు. ఇప్పటికే చైనాకు చెందిన ఒప్పో మొబైల్స్ కు ఆర్యన్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ కంపెనీతో ఒప్పందాన్ని ఆయన వదులుకున్నట్టు సమాచారం. ఆర్యన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.