ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా!

10-07-2020 Fri 12:04
  • తండ్రి తరఫున విస్తృత పర్యటనలు చేసిన కుమారుడు
  • హోమ్ క్వారంటైన్ లోకి కృష్ణదాస్, తమ్మినేని సీతారాం
  • క్యాంపు కార్యాలయాల మూసివేత
Dharmana Krishnadas Son gets Corona Positive

ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా సోకింది. దీంతో కృష్ణదాస్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. బుధవారం నాడు జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో కృష్ణదాస్ తో పాటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే సీతారాం కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. మరో రెండు వారాల పాటు మంత్రి, స్పీకర్ క్యాంపు కార్యాలయాలకు కార్యకర్తలు, ప్రజలు ఎవరూ రావద్దని అక్కడి అధికారులు కోరారు.

కాగా, గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాస్ తరఫున ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆయనకు, వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనతో పాటు తిరిగిన కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.