China: చైనాలో ఎంబీబీఎస్ చదివితే, ఇండియాలో హౌస్ సర్జన్ చేసేందుకు వీల్లేదన్న కేంద్రం!

  • తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న కేంద్రం
  • ఆరేళ్ల కోర్సు చదివితేనే హౌస్ సర్జెన్సీ
  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
Center New Rules on China Medicle Students

చైనాలోని యూనివర్శిటీల్లో ఎంబీబీఎస్ చదివిన భారత విద్యార్థులు, దేశంలో హౌస్ సర్జెన్సీ చేసేందుకు వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేవలం ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తామంటూ, కేంద్రం తన తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇంత అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల, చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కాగా, చైనా వర్శిటీల్లో ప్రతి సంవత్సరమూ దాదాపు 5 వేల మంది వరకూ భారత విద్యార్థులు ప్రవేశం పొందుతుంటారు. వారిలో తెలుగువారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. వాస్తవానికి చైనాలోనూ ఎంబీబీఎస్ కోర్సు ఆరేళ్లు కాగా, ఐదేళ్ల తరువాత ఇండియాలో హౌస్ సర్జన్సీ చేసుకునే అవకాశం ఉంది. ఇకమీదట ఆ వెసులుబాటు ఉండదు. వైద్య విద్యకు పేరున్న ఇతర దేశాలైన బల్గేరియా, ఫిలిప్పైన్స్, రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ఆరేళ్ల కోర్సు నడుస్తోందన్న సంగతి తెలిసిందే.

More Telugu News