లైంగిక వేధింపుల విషయం బయటకు రాగానే... సియోల్ మేయర్ ఆత్మహత్య!
- ఇటీవలే లైంగిక వేధింపుల కేసు
- నిన్న ఇంటి నుంచి అదృశ్యమైన పార్క్ వోన్
- ఈ ఉదయం విగతజీవిగా గుర్తింపు
తన తండ్రి కనిపించడం లేదని పార్క్ కుమార్తె గురువారం నాడు పోలీసులను ఆశ్రయించగా, అప్పటి నుంచి ఆయన్ను వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన తరువాత, ఆయన తనకు ఫోన్ చేశారని, అవే ఆయన చివరి మాటలుగా తనకు అనిపించిందని, ఆపై తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. కాగా, దక్షిణ కొరియా డెమొక్రటిక్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న పార్క్ వోన్ - సూన్, దాదాపు దశాబ్దకాలం పాటు సియోల్ ప్రజా ప్రతినిధిగా కొనసాగారు.