తన చిన్నప్పటి ఫొటోను అభిమానులతో పంచుకున్న సినీనటి రమ్యకృష్ణ!

10-07-2020 Fri 11:06
  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రమ్యకృష్ణ
  • తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఫొటో
  • తన ముఖాన్ని రౌండప్‌ చేసి పోస్ట్
ramya krishna childhood pic goes viral

సినీనటి రమ్యకృష్ణ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన చిన్నప్పటి ఫొటోను పోస్ట్ చేశారు. పాఠశాలలో చదువుతోన్న సమయంలో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఈ ఫొటో తీసుకున్నారు. అందులో తన ముఖాన్ని రౌండప్‌ చేసి పోస్ట్ చేశారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల సినిమా షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటులు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పటి ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా, రమ్యకృష్ణ పోస్ట్ చేసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో రమ్య‌కృష్ణ క‌ళ్లజోడు పెట్టుకుని కనపడుతున్నారు. సౌతిండియా సినిమాల్లో దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆమె నటించింది. ఒకప్పుడు టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. అంతేగాక, రజనీకాంత్‌ 'నరసింహ' సినిమాలో నీలాంబరి, బాహుబలి సినిమాలో 'శివగామి' వంటి పాత్రల్లోనూ రమకృష్ణ నటించి అందరినీ మెప్పించారు.