విజయవాడలో కోట్ల రూపాయల దేవుడి స్థలంపై పెద్దల కన్ను: దేవినేని ఉమ

10-07-2020 Fri 09:36
  • తమవారికి కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు
  • కీలకమంత్రి చక్రం తిప్పడంతో చకచకా ఉత్తర్వులు
  • ఏం చర్యలు తీసుకున్నారు జగన్‌ గారు?
devineni fires on ycp

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు. 'విజయవాడలో ఖరీదైన, కోట్ల రూపాయల దేవుడి స్థలంపై పెద్దల కన్ను పడింది. తమవారికి కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు "కీలకమంత్రి" చక్రం తిప్పడంతో చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి. శివయ్య స్థలం స్వాహా కాకుండా కాపాడేందుకు అధికారులు, మీ ప్రజాప్రతినిధులు, మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి జగన్ గారు' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

విజయవాడలోని సత్యనారాయణపురంలో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన స్థిరాస్తిగా ఉన్న రూ.10 కోట్ల విలువచేసే 900 గజాల స్థలాన్ని స్వాహా చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారంటూ వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.