Vijayasai Reddy: ఇది ట్రయిలర్ మాత్రమే... అసలు సినిమాలో జైలుకు వెళ్లాల్సిందే: విజయసాయి రెడ్డి

Vijayasai Warning to TDP Leaders
  • ట్రయిలర్ కే కలుగులో దాక్కున్న ఎలుక
  • అసలు సినిమా నాలుగేళ్లుంటుంది
  • దొంగల ముఠా జైలుకు వెళ్లాల్సిందేనన్న వైసీపీ ఎంపీ

వైఎస్ జగన్ ఏడాది పాలన ట్రయిలర్ మాత్రమేనని, అసలు సినిమా చూస్తే, చంద్రబాబు ఏమవుతాడోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, దోపిడీలు, స్కాములు చేస్తూ, దొరికి పోయిన దొంగల ముఠా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు.

"జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభవజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే" అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News