ఇంట్లోనే బయో ఎంజైములు తయారు చేస్తున్న సమంత... వీడియో ఇదిగో

10-07-2020 Fri 08:28
  • లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం
  • హౌస్ గార్డెనింగ్ పై కన్నేసిన సమంత
  • హౌస్ క్లీనింగ్ లో రసాయనాలు అవసరం లేదని వెల్లడి
Samantha Making Bio Engymes in Home Video

దక్షిణాది భాషలన్నింటిలో నటించి, మెప్పించిన అందాల బొమ్మ సమంత, ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేక, భర్త నాగ చైతన్యతో ఇంట్లోనే ఉంటూ, వివిధ రకాల వంటలను నేర్చుకుంది. గత మూడు నెలలుగా తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇక, ఇటీవల హౌస్ గార్డెనింగ్ పై దృష్టి పెట్టిన సమంత, బయో ఎంజైములను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుని, చేసి చూపిస్తోంది. ఇంటిని శుభ్రపరచుకునేందుకు ఎటువంటి రసాయనాలనూ వాడక్కర్లేకుండా, వీటితో చేసుకోవచ్చని సమంత చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేయగా, అది వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.