ఫలక్‌నుమా, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపులను కుదించిన రైల్వే

10-07-2020 Fri 07:38
  • ‘ఫలక్‌నుమా’కు బలుగాం, బరంపురం స్టాపులు ఎత్తివేత
  • ‘కోణార్క్’కు బరంపురం, ఛత్రపూర్, బలుగాం స్టాపుల తొలగింపు
  • కొవిడ్ కారణంగానే నిర్ణయం
Falaknuma Express rail stops reduced

సికింద్రాబాద్-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపులను కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని బలుగాం, బరంపురం స్టేషన్లలో ఇప్పటి వరకు ఈ రైలుకు స్టాపులు ఉండగా, నిన్నటి నుంచి ఈ రెండు స్టాపులను తొలగించింది. భువనేశ్వర్- ముంబై సీఎస్‌టీ మధ్య నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపులను కూడా తగ్గించింది. బరంపూర్, ఛత్రపూర్, బలుగాం స్టేషన్లలో ఇప్పటి వరకు ఈ రైలు ఆగుతుండగా, ఇకపై ఈ స్టేషన్లలో రైలు ఆగదని అధికారులు పేర్కొన్నారు.