సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కాబోయే భర్త గురించి చెప్పిన రకుల్
- ఓటీటీ వైపు దృష్టి సారిస్తున్న రాజమౌళి
- 'ఐ ఫోన్'తో మలయాళ సినిమా షూటింగ్
* ఈ లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫాం విలువ మరింత పెరిగింది. చాలామంది వీటికి కంటెంట్ సమకూర్చే పనుల్లో పడుతున్నారు. స్టార్ హీరోయిన్లు కూడా వెబ్ సీరీస్ వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ఓటీటీకి కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఆయన సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
* తాజాగా మలయాళంలో ఇద్దరు స్టార్ హీరోలు కలసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో విశేషం లేకపోయినా ఈ చిత్రాన్ని 'ఐ ఫోన్'తో చిత్రీకరించనుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఫహద్ ఫాజిల్, రోషన్ మాథ్యూ కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మహేశ్ నారాయణన్ ఐ ఫోన్ తో చిత్రీకరిస్తాడట.